ట్రావెల్ బ్యాన్ దేశాల నుంచి దుబాయ్ ఎక్స్ పో 2020కి ఎంట్రీ
- July 23, 2021
దుబాయ్: ప్రపంచంలోనే అతిపెద్దదిగా చెప్పుకుంటున్న దుబాయ్ ఎక్స్ పో 2020కి అంతా సిద్ధమవుతోంది. ఎక్స్ పోలో పాల్గొనేందుకు వచ్చే వారిని ఎలాంటి అవాంతరాలు లేకుండా యూఏఈ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ట్రావెల్ బ్యాన్ లిస్టులో ఉన్న 16 దేశాలకు కొన్ని సడలింపులు ప్రకటించింది. ఎక్స్ పోలో పాల్గొనేందుకు వచ్చేవారిని కూడా ముందస్తు అనుమతులతో ఆమోదించనున్నట్లు యూఏఈ జిసిఏఏ స్పష్టం చేసింది. ప్రస్తుతం యూఏఈ ట్రావెల్ బ్యాన్ లిస్టులో ఇండియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లైబీరియా, నమీబియా, నేపాల్, నైజీరియా, ఉగాండా, సియెర్రా లియోన్, శ్రీలంక, వియత్నాం, జాంబియా దేశాలు ఉన్నాయి. అయితే..ఈ 16 దేశాల నుంచి కూడా ఎక్స్ పో 2020లో పాల్గొనేందుకు
అనుమతించిన వర్గాల వివరాలు ఇలా ఉన్నాయి.
-యూఏఈ పౌరులు, వారి కుటుంబ సభ్యులు మరియు వారి మొదటి-డిగ్రీ బంధువులు.
- ట్రావెల్ బ్యాన్ దేశాల నుంచి యూఏఈకి నియమించిన దౌత్యవేత్తలు, అడ్మినిస్ట్రేటీవ్ సిబ్బంది.
- ముందస్తు అనుమతి పొందిన అధికారిక ప్రతినిధులు.
- గోల్డ్, సిల్వర్ రెసిడెన్సీ వీసా పొందిన యూఏఈ ప్రవాసీయులు.
- దుబాయ్ ఎక్స్ ఎక్స్పో 2020 నిర్వాహకులు వ్యక్తిగతంగా స్పాన్సర్ చేసిన ఎక్స్పో ఎగ్జిబిటర్లు, ఇంటర్నేషనల్ పార్టిసిపేంట్స్.
- విదేశీ ఉత్పత్తులను తీసుకొచ్చే కార్గో విమానాల సిబ్బంది.
- పోర్ట్స్, బోర్డర్స్, ఫ్రీ జోన్ల సెక్యూరిటీ జనరల్ అథారిటీ అనుమతి పొందిన బిజినెస్ మెన్, బిజినెస్ వుమెన్.
- ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ & సిటిజన్ షిప్ వర్గీకరణ ప్రకారం కీలకమైన విధులకు చెందిన ఉద్యోగులు.
పైన తెలిపిన కేటగిరిల వారు ట్రావెల్ బ్యాన్ జాబితాలో ఉన్న 16 దేశాల నుంచి కూడా యూఏఈ వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఈ మెగా ఈవెంట్ టికెట్లు ఎక్స్పో వెబ్సైట్ తో పాటు 2,500 అధికారిక రీసెల్లర్ల దగ్గర్నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. ఇదిలాఉంటే ఈ వరల్డ్ బిగ్గెస్ట్ ఎక్స్ పో అక్టోబర్ 1, 2021న ప్రారంభమై మార్చి 31, 2022తో ముగుస్తుంది.ఎక్స్పో 2020 వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం, ఈవెంట్లో పాల్గొనే 191 దేశాల ప్రతినిధులకు ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేస్తున్నారు.ఎక్స్‌పోలో రోజుకు 60 వరకు లైవ్ ఈవెంట్లు ఉంటాయి - సినిమా రాత్రులు, కవిత్వ పఠనాలు, ఆర్ట్ యాక్టివేషన్స్, సంగీత కచేరీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి.అలాగే 200లకుపైగా ఫుడ్ వెరైటీలు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







