కోవిడ్ రూల్ బ్రేక్..379 మందిపై చట్టపరమైన చర్యలు
- July 24, 2021
దోహా: కోవిడ్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని ఉపేక్షించేది లేదని ఖతార్ అధికారులు మరోసారి హెచ్చరించారు. కోవిడ్ నిబంధనలు పాటించకపోవటం అంటే చట్టవిరుద్ధ చర్యలకు పల్పడుతున్నట్లేనని స్పష్టం చేసింది. కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన వారిపై ఇప్పటికే వేల సంఖ్యలో కేసులు నమోదు చేసిన ఖతార్ అధికారులు...తాజాగా మరో 379 మందిపై చర్యలు తీసుకుంది. ఇందులో 318 మంది ఫేస్ మాస్క్ ధరించలేదని, మరో 57 మంది భౌతిక దూరం పాటించలేదని వెల్లడించారు. అలాగే ఎతెరాజ్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోని నలుగురు ఉన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించని వాళ్లందర్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలు అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన వేల కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







