సౌదీలో ఆరుగురు భారతీయులు అరెస్ట్..!
- July 24, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో అక్రమ డబ్బు బదిలీలు చేస్తున్న ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు.దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి ఈ ఆరుగురు ఓ ముఠాగా ఏర్పడి చట్ట విరుద్ధంగా డబ్బు బదిలీ చేస్తున్నట్లు సౌదీ పోలీసులు గుర్తించారు. ఓ సౌదీ వ్యక్తికి చెందిన వాణిజ్య బ్యాంక్ ఖాతా ద్వారా ఈ లావాదేవీలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.సౌదీ వ్యక్తిని ఈ ముఠా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులకు చెల్లింపులు చేస్తున్నట్లు నమ్మించి అక్రమ నగదు బదిలీలు చేశారని రియాద్ పోలీస్ అధికారి ఖలీద్ అల్ కరిదిస్ వెల్లడించారు.
ఇలా సుమారు 3.4 మిలియన్ సౌదీ రియాళ్లు ట్రాన్స్ఫర్ అయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. నిందితులందరూ 20 నుంచి 30 ఏళ్లలోపు వయసు వారేనని తెలిపారు.నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామని,త్వరలోనే వారిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు చెప్పారు.ఇక మొత్తం 34.8 మిలియన్ల సౌదీ జనాభాలో సుమారు 10.5 మిలియన్ల మంది ప్రవాసులు ఉన్నట్లు సమాచారం.కాగా, గడిచిన కొన్ని నెలలుగా దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిపై సౌదీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.దీనిలో భాగంగా నివాస, సరిహద్దు వ్యవస్థలను ఉల్లంఘించిన వారి పట్ల సౌదీ అరేబియా అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







