సౌదీ: 14,600 అక్రమ నివాసితుల అరెస్ట్
- July 25, 2021
సౌదీ: సౌదీ నిబంధనలను అతిక్రమించి అక్రమంగా ఉంటున్న దాదాపు 14,600 మంది అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో కొందరు రెసిడెన్సీ పర్మిట్, లేబర్ చట్టాలను ఉల్లంఘిస్తే ఇంకొందరు అక్రమంగా దేశంలోకి చొరబడి సరిహద్దు భద్రత నిబంధనలను అతిక్రమించినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని ఏరివేసేందుకు భద్రతా విభాగాలకు చెందిన అధికారులు, జవాజత్ అధికారుల సంయుక్త బృందం ఈ నెల 15 నుంచి 21 మధ్యకాలంలో కింగ్డమ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 14,600 మంది పట్టుబడినట్లు వెల్లండించింది. అరెస్టైన వారిలో 4,500 మంది రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తే, 9000 మంది బోర్డర్ సెక్యూరిటీ రెగ్యూలేషన్స్ అతిక్రమించారు. 1000కి పైగా లేబర్ చట్టాల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. దీంతో అక్రమంగా నివసిస్తూ ఇటీవలి కాలం పట్టుబడిన ప్రవాసీయుల సంఖ్య 60,000 వేలకు చేరింది. 50,000 మంది పురుషులు ఉండగా, 9,600 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 40,000 మందిని వారి సొంత దేశాలకు పంపించివేయాల్సిందిగా సూచిస్తూ వారి వారి దేశాల వారీగా దౌత్యకార్యాలయాలకు అప్పగించారు. ఇదిలాఉంటే చట్టాల అమలు విషయంలో సౌదీ ప్రభుత్వం నిఖ్ఖచ్చిగా ఉంటుందన్న విషయాన్ని అతిక్రమణదారులంతా దృష్టిలో ఉంచుకోవాలని, ఎవరైనా అక్రమ నివాసితులు పట్టబడితే 15 వరకు జైలు శిక్ష, మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుందని కింగ్డమ్ ప్రభుత్వం హెచ్చరించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







