వ్యాక్సినేషన్ కేంద్రాలకు ఎగబడ్డ జనం..స్వల్ప తోపులాట
- July 25, 2021
కువైట్: కువైట్‌లోని కొన్ని వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గర అధికారులు అంచనా వేయలేదని దృశ్యాలు కనిపించాయి. జనం పెద్దసంఖ్యలో రావటంతో వ్యాక్సిన్ కేంద్రాలు కిటకిటలాడాయి. కొన్ని చోట్ల తోపులాటలు చోటు చేసుకున్నాయి. సోషల్ మీడియాలో జరిగిన తప్పుడు ప్రచారమే దీనికి కారణం. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వాళ్లందరికీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వ్యాక్సిన్ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం జోరందుకుంది. ఇదే నిజమని నమ్మిన జనం పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ కేంద్రాలకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో తోపులాటలు కూడా జరిగాయి. దీంతో అలర్టైన ఆరోగ్య శాఖ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని కొట్టిపారేసింది. ముందస్తుగా రిజిస్టర్ చేసుకొని ఆరోగ్య శాఖ నుంచి మెసేజ్ రూపంలో అపాయింట్మెంట్ పొందిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!







