"శ్యామ్ సింగ రాయ్" షూటింగ్ పూర్తి.!
- July 26, 2021
నేచురల్ స్టార్ నాని, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'శ్యామ్ సింగ రాయ్' చిత్రానికి మేకర్స్ గుమ్మడికాయ కొట్టేశారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం కోల్‌కతా నేపథ్యంలో సెట్ చేయబడింది. నాని బెంగాలీ లుక్ ఉన్న ఫస్ట్ లుక్ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. కోవిడ్-19 కారణంగా చిత్రం చివరి షెడ్యూల్ వాయిదా పడింది. లేదంటే సినిమా చిత్రీకరణ ఒక నెల క్రితమే పూర్తయ్యేది. ఇక షూటింగ్ పూర్తయిన సందర్భంగా నాని 'గొప్ప బృందంతో షూటింగ్ పూర్తి చేశాము. మంచి ఫలితం వస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభం' అంటూ ట్వీట్ చేశారు.
దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఓ యూనిక్ కాన్సెప్ట్‌తో 'శ్యామ్‌సింగ రాయ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత చిత్రాలకు భిన్నమైన సరికొత్త గెటప్స్‌లలో నేచురల్ స్టార్ నాని కనిపించనున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని నిర్మాత వెంకట్ బోయనపల్లి రూపొందిస్తున్నారు. జీస్సూసేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందించారు. మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







