త్వరలో అమెజాన్‌ లో క్రిప్టోకరెన్సీ పేమెంట్స్ !

- July 26, 2021 , by Maagulf
త్వరలో అమెజాన్‌ లో క్రిప్టోకరెన్సీ పేమెంట్స్ !

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో త్వరలో డిజిటల్ కరెన్సీ పేమెంట్లు చేసుకోవచ్చు. బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ పేమెంట్స్ చేసుకునేలా యూజర్లను అనుమతించనుంది. అమెజాన్‌ క్రిప్టోకరెన్సీ పేమెంట్స్‌కు సంబంధించి బ్లాక్‌చెయిన్‌ ప్రొడక్ట్‌ లీడ్‌, డిజిటల్‌ కరెన్సీ నిపుణుల బృందాల నియమించాల్సి ఉంది. అమెజాన్‌ జాబ్‌ లిస్ట్‌ ప్రకారం.. డిజిటల్‌ కరెన్సీ, బ్లాక్‌ చెయిన్‌ టూల్స్‌కు చెందిన నిపుణులను నియమించనుంది. క్రిప్టోకరెన్సీకి సంబంధించిన పేమెంట్స్‌ ప్రొడక్ట్ రోడ్‌మ్యాప్‌, బ్లాక్ చెయిన్ స్ట్రాటజీని రెడీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

కస్టమర్ అనుభవం, టెక్నికల్‌ స్ట్రాటజీ, సామర్థ్యాలతో పాటు లాంచ్ స్ట్రాటజీ కోసం క్రిప్టోకరెన్సీ రోడ్‌మ్యాప్‌ను డెవలప్ చేయనుంది. అందుకోసం అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌(AWS)తో సహా ఇతర ప్రొడక్ట్‌ డెవలపింగ్‌ కంపెనీలతో అమెజాన్‌ కలిసి పనిచేయనుంది. అమెజాన్‌ ఇప్పటివరకూ క్రిప్టోకరెన్సీలను పేమెంట్లుగా అంగీకరించలేదు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) బ్లాక్‌చైన్‌ సర్వీసులను మాత్రమే ఆఫర్ చేస్తోంది. టెక్ దిగ్గజం ఆపిల్ కూడా గత మే నెలలో బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజింగ్ కోసం డిజిటల్ వాలెట్స్ మాదిరి BNPL, Fast Payments, cryptocurrency వంటి లిస్టింగ్ పోస్టు చేసింది. టెస్లా, ట్విట్టర్ త్వరలో బిట్ కాయిన్ పై పేమెంట్ మోడ్ తీసుకురానున్నాయి.

ఆన్‌లైన్ ప్రపంచానికి గ్లోబల్ కరెన్సీ అవసరం. అందుకే బిట్‌కాయిన్‌పై దృష్టిపెట్టినట్టు ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సె చెప్పారు. ఎందుకంటే ఈ క్రిప్టోకరెన్సీతో ఈ భూమిపై ప్రతిఒక్క వ్యక్తిని చేరుకోవచ్చు. టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ క్రిప్టోకరెన్సీపై తమ కంపెనీ బిట్‌కాయిన్ పేమెంట్స్ తిరిగి ప్రారంభించబోతున్నామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com