జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా
- July 26, 2021
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ పై ఈ రోజు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో మరోసారి విచారణ జరిగింది.ఇప్పటికే జగన్, రఘురామకృష్ణరాజు లిఖిత పూర్వకంగా తమ వాదనలు సమర్పించారు.అయితే, లిఖిత పూర్వకంగా తామూ వాదనలు సమర్పిస్తామని సీబీఐ చెప్పింది. అందుకు మరోసారి గడువు ఇవ్వాలని కోర్టును కోరింది.దీంతో విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.కాగా, జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై ఈ నెల 14న కూడా విచారణ జరగగా, తాము లిఖిత పూర్వకంగా వాదనలు సమర్పించేందుకు 10 రోజుల గడువు ఇవ్వాలని సీబీఐ కోరిన విషయం తెలిసిందే.
సీబీఐ తీరుపై రఘురామ తరఫు న్యాయవాది ఆ సమయంలో అభ్యంతరాలు తెలిపారు. సీబీఐ తరచూ వైఖరి మారుస్తూ కాలయాపన చేస్తోందన్నారు. దీంతో కోర్టు ఆ సమయంలో ఈ నెల 26 (నేడు)కి విచారణను వాయిదా వేయడంతో నేడు విచారణ జరిగింది. అయితే, సీబీఐ మరింత సమయం కోరడంతో వాయిదా పడింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







