ఎన్టీఆర్ విడుదల చేసిన 'తిమ్మరుసు' ట్రైలర్
- July 26, 2021హైదరాబాద్: టాలెంటెడ్ యంగ్ స్టార్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న చిత్రం “తిమ్మరుసు”. ఈ చిత్రంలో సత్యదేవ్ నిజాయితీగల కార్పొరేట్ న్యాయవాదిగా కనిపించబోతున్నాడు. ఆయన సరసన ప్రియాంక జవాల్కర్ రొమాన్స్ చేయనుంది. బ్రహ్మజీ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి శరణ్ దర్శకత్వం వహించాడు. మహేష్ కొనేరు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 30న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు మేకర్స్. ఈ రోజు ట్రైలర్ విడుదలైంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా లాంచ్ చేశారు. ట్రైలర్ చూసిన ఆయన ఆసక్తికరంగా ఉందని చెబుతూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ తరువాత థియేటర్లలో మొదటగా విడుదలవుతున్న ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తాజాగా ఈ విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఇందులోని క్రైమ్ కోణం దానికి తగ్గట్లుగా ఉన్న బ్యాక్ గగ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఈ గ్రిప్పింగ్ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.
తాజా వార్తలు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్