సొంత గొంతుతో తెలుగు డబ్బింగ్ : సూర్య
- March 12, 2016
కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు సూర్య. తన ప్రతి సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేసే సూర్య తదుపరి సినిమా 24 విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. అయితే ఇప్పటివరకు సూర్య సినిమాలకు వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించేవారు. తమ్ముడు కార్తీ తెలుగులో డబ్బింగ్ చెప్పటం ప్రారంభించినా సూర్య మాత్రం రిస్క్ తీసుకోలేదు. అయితే 24 చిత్రంలో ఆ రిస్క్ కు రెడీ అవుతున్నాడు సూర్య.మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై టాలీవుడ్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ఇటీవల రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద మరింత హైప్ క్రియేట్ చేసింది.ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్న సూర్య ఒక పాత్రకు తన సొంత గొంతుతో తెలుగు డబ్బింగ్ చెపుతున్నాడు. ఇదే వర్కవుట్ అయితే ఇక ముందు రాబోయే సినిమాలన్నింటిలో ఫ్యాన్స్ సూర్య సొంత గొంతు వినొచ్చు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







