గోపీచంద్ 30వ చిత్రంలో డా.రాజశేఖర్!
- August 05, 2021
హైదరాబాద్: వెండితెరపై ఫెరోషియస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ చేసి మెప్పించిన డాక్టర్ రాజశేఖర్ కెరీర్ కొంతకాలంగా నత్తనడకన సాగుతోంది.ఆ మధ్య కరోనా నుండి బయటపడిన రాజశేఖర్ వరుసగా మూడు చిత్రాలను అంగీకరించాడు.అయితే…వాటి షూటింగ్ స్టేటస్ ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే…గతంలో మల్టీస్టారర్ మూవీస్ కొన్ని చేసినా…ఆ తర్వాత రాజశేఖర్ సోలో హీరోగా సినిమాలు చేయడానికే ప్రాధాన్యమిచ్చారు. అయితే…తాజాగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది.
గోపీచంద్ 30వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించబోతున్నాడు. దీనిని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మించబోతున్నాడు. గతంలో గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాలు సక్సెస్ కావడంతో సహజంగానే ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇందులో ఓ కీలక పాత్ర కోసం డాక్టర్ రాజశేఖర్ ను దర్శకుడు శ్రీవాస్ అప్రోచ్ కాగానే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. హీరోతో పాటు సరి సమానంగా ఆ పాత్రకు ప్రాధాన్యం ఉండటం ఒక కారణంగా కాగా, గోపీచంద్ తండ్రి ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ హీరోగా రాజశేఖర్ నిలబడటం కోసం గట్టి పునాదిని వేశారు. ఆ అభిమానంతోనూ రాజశేఖర్ ఈ మూవీ చేయడానికి అంగీకారం తెలిపారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే… రాజశేఖర్ హీరోగా ‘మర్మాణువు, శేఖర్’తో పాటు మరో సినిమా ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. దీనితో పాటే రాజశేఖర్ ఓ తమిళ సినిమాలోనూ కీలక పాత్ర చేయబోతున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- BCCI Naman Awards: మిథాలీ రాజ్‌కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- దుబాయ్‌లో యూఏఈ అధ్యక్షులు మరియు జోర్డాన్ రాజు భేటీ!
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా
- ఈద్ అల్ ఫితర్.. దుబాయ్ లో 3 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- నివాస ఉల్లంఘనదారులకు ఆశ్రయం కల్పిస్తే SR100,000 జరిమానా, జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో 240,000 మందికి పైగా విద్యార్థులకు ఆన్లైన్ చదువులు..!!









