ఉత్తమ ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా దుబాయ్ పోలీస్ ఉన్నతాధికారి

- August 13, 2021 , by Maagulf
ఉత్తమ ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా దుబాయ్ పోలీస్ ఉన్నతాధికారి

దుబాయ్: దుబాయ్ పోలీస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ జనరల్ డిపార్టుమెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఖాలిద్ నాజర్ అల్ రజూకి, 2021 ఉత్తమ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విభాగంలో (ప్రభుత్వ శాఖల్లో) అవార్డు గెలుచుకున్నారు. దుబాయ్‌కి చెందిన డెసిషన్ మేకర్స్ వేదిక సిఎక్స్ఓ డిఎక్స్ ఈ అవార్డుని అందించింది. 65 మంది ఎగ్జిక్యూటివ్ లీడర్లను ఈ అవార్డుల కోసం ఎంపిక చేశారు.  కోవిడ్ 19 పాండమిక్ నేపథ్యంలో అత్యంత సమర్థవంతంగా వీరు తమ పని తీరుని ప్రదర్శించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. నేషనల్ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ సందర్భంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సమర్థవంతంగా రజూకి వినియోగించారు. సాంకేతిక సమస్యలు రాకుండా, అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడంలో దుబాయ్ ఎప్పుడూ ముందు వరుసలో వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com