వలస టీచర్ల నియామకంపై స్పష్టతనిచ్చిన ఒమన్ మినిస్ట్రీ

- August 13, 2021 , by Maagulf
వలస టీచర్ల నియామకంపై స్పష్టతనిచ్చిన ఒమన్ మినిస్ట్రీ

మస్కట్: కొన్ని స్పెషలైజేషన్స్‌కి సంబంధించి టీచింగ్ పొజిషన్స్ నియామకంపై అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ కాంట్రాక్టింగ్ కమిటీ చేపడుతున్న చర్యలపై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పష్టతనిచ్చింది. కొత్త అకడమిక్ ఇయర్ వచ్చేస్తున్న దరిమిలా, మినిస్ట్రీ ఆయా ఖాళీల్ని భర్తీ చేయడం ద్వారా విద్యార్థులకు సమస్యలు తలెత్తకుండా చూడాలనుకుందనీ, ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొంది. అర్హులైన ఒమనీ అభ్యర్థులకు ఆయా విభాగాల్లో అవకాశాలు కల్పించే ప్రక్రియ కొనసాగుతుందనీ, ఒమనైజేషన్ ప్రక్రియకు కట్టుబడి వున్నామనీ మినిస్ట్రీ వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com