భారత స్వాతంత్ర్య దినోత్సవం: భారత రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన సౌదీ రూలర్స్

- August 14, 2021 , by Maagulf
భారత స్వాతంత్ర్య దినోత్సవం: భారత రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన సౌదీ రూలర్స్

రియాద్: కింగ్ సల్మాన్, భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కి భారత స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజలంతా ఆనందోత్సాహాలతో వుండాలనీ, ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ఆయురారోగ్యాలతో వుండాలనీ, భారతదేశం అత్యద్భుతమైన ప్రగతిని సాధించాలనీ కింగ్ సల్మాన్ ఆకాంక్షించారు. క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ (డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అలాగే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్) కూడా ఈ సందర్భంగా భారత రాష్ట్రపతికి భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com