BECILలో ఉద్యోగావకాశాలు

- August 21, 2021 , by Maagulf
BECILలో ఉద్యోగావకాశాలు

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL).. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద (AIIA)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో బాగంగా మొత్తం 162 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో (ఆగస్టు 22) ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

  • మొత్తం 162 ఖాళీలకు గాను సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, రీసెర్చ్‌ అసోసియేట్, రీసెర్చ్‌ కోఆర్డినేటర్, సైంటిస్ట్, బయో మెడికల్‌ ఇంజనీర్, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజిస్ట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌(PRO) పోస్టులను భర్తీ చేయనున్నారు.
  • పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి.
  •  అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
  • అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

  • అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అభ్యర్థులను రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులకు వివిధ పోస్టుల ఆధారంగా నెలకు రూ.15,492 నుంచి రూ.1,23,100 వరకు చెల్లిస్తారు.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 22తో ముగియనుంది.

మరిన్ని వివరాల కోసం ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.  

https://www.becil.com/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com