రూ.11 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
- August 22, 2021
బెంగుళూరు: డ్రగ్స్ దందా కలవరపెడుతోంది. మత్తు పదార్థాలను దేశంలోకి తెచ్చేందుకు అక్రమార్కులు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా 1.3 కేజీల కొకైన్ ప్యాకెట్లను పొట్టలో దాచుకుని తరలిస్తున్న ఆఫ్రికా దేశస్థుడు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డాడు. అతను దుబాయ్ నుంచి వచ్చాడు. విమానంలో ఇచ్చిన ఆహారాన్ని, నీటిని అతడు తీసుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు.. అతడిని స్కాన్ చేయగా పొట్టలో కొకైన్ పదార్థం ఉన్నట్లు గుర్తించి.. అరెస్ట్ చేశారు. డాక్టర్ల సహాయంతో కొకైన్‌ను బయటకు తీశారు. పట్టుబడ్డ 1.3 కిలోల కొకైన్ విలువ రూ.11 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో ఓ గుర్తుతెలియని వ్యక్తి.. నిందితుడిని బెంగళూరుకు పంపించాడు. అతడికి ఓ లగ్జరీ హోటల్లో గది బుక్ చేశాడని.. అధికారుల విచారణలో తేలింది. అక్కడ నుంచి పంపిన వ్యక్తి ఎవరు, అది ఎవరికి సప్లై చేయడానికి వచ్చాడు అనే వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని తెలిపారు. నిందితుడు తొలుత నేరాన్ని ఒప్పుకోలేదు. తర్వాత కడుపులో ఇబ్బందిగా ఉండటంతో పోలీసులను ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కోరాడు.
నిందితుడి వయసు 30 ఏళ్లు ఉంటుందని, బెంగళూరులో కిడ్నీ చికిత్స కోసం వస్తున్నట్టు వీసాను కూడా వైద్యం కోసం తీసుకున్నాడని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు వివరించారు. మంగళవారం రాత్రి అతడి అదుపులోకి తీసుకుని హాస్పిటల్‌కి తరలించామని, స్కాన్ చేయడంతో క్యాప్సుల్స్ విషయం బయటపడిందన్నారు. శుక్రవారం సాయంత్రం ఆపరేషన్ నిర్వహించి వాటిని బయటకు తీసినట్టు డీఆర్ఐ అధికారి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







