ఆసుపత్రిలో చేరిన అభిషేక్ బచ్చన్
- August 24, 2021
ముంబై: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ సినిమా షూటింగ్ లో గాయపడి మూడు రోజులు అవుతోంది. ఈ ప్రమాదాల్లో ఆయన చేతికి ఫ్రాక్చర్ అయింది. ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొంది ఆరోజే డిశార్చ్ అయ్యారు. అయితే గాయ పరిస్థితిపై తిరిగి మరోసారి ఆయన ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆయనను చూసేందుకు తండ్రి అమితాబ్ బచ్చన్, సోదరి శ్వేత బచ్చన్ ఆసుపత్రికి వెళ్లారు. అయితే అభిషేక్ కు గాయాలైనట్టు వస్తున్న వార్తలపై ఆయన కుటుంబం గాని, చిత్రయూనిట్ గాని స్పందించకపోవడంతో ఫేక్ న్యూస్ గా భావించారు. కాగా, అభిషేక్ ఆసుపత్రికి వెళ్తున్న ఫోటోలు బయటకి రావటంతో నిర్దారణ అయింది. ‘బాబ్ విశ్వాస్’ సినిమా షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







