అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో డబ్బులు జమ
- August 24, 2021
అమరావతి: అగ్రిగోల్డ్ డిపాజిట్లరకు కాసేపటి క్రితమే నగదు జమ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…దాదాపుగా 7లక్షల పైచిలుకు డిపాజిటర్లకు 666.84 కోట్లు ఇస్తున్నామని…మొత్తంగా అగ్రిగోల్డ్ డిపాజిటర్లు 10.4 లక్షల మందికి రూ.905.57 కోట్లకు పైగా ఆర్థిక సహాయం చేశామని తెలిపారు.ఇచ్చిన మాట ప్రకారం బాధితులకు న్యాయం చేశామని…రూ.20వేల లోపు డిపాజిట్ చేసిన కుటుంబాలు అన్నింటికీ.. కనీసం ఆ రూ.20వేలైనా తిరిగి ఇచ్చేసే కార్యక్రమం ఈరోజుతో పూర్తిచేస్తున్నామన్నారు.
ఒక ప్రైవేటు కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును ప్రభుత్వం చెల్లించటం దేశంలో ఎక్కడా జరుగలేదని తెలిపారు.2015లోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి మోసం చేశారని… అగ్రిగోల్డ్ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల కోసం జరిగిన స్కామ్ అని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ ఆస్తులను ఏవిధంగా కొట్టేయాలనుకున్నారో గతంలో అసెంబ్లీలో చెప్పామని… ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరిలో జీవో ఇచ్చి రూపాయి కూడా గత ప్రభుత్వం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వం ఐదేళ్లపాటు మోసాలు చేస్తూ వచ్చిందన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







