అజ్మన్ లో నిరుపేదలకు ఉచితంగా ఇంధనం
- August 24, 2021
అజ్మన్: అజ్మన్ లో నిరుపేదలకు ఉచితంగా పెట్రోల్, డీజిల్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం ఇంధనాన్ని హోం డెలివరీ చేసే,కారు సర్వీస్ కంపెనీ అయిన సీఏఎఫ్‌యూ(CAFU) మందుకొచ్చింది.అల్ ఇహ్సాన్ ఛారిటీ అసోసియేషన్ భాగస్వామ్యంతో సీఏఎఫ్‌యూ అజ్మన్‌లోని అల్పాదాయ కుటుంబాలు, వ్యక్తులకు ఇలా ఉచితంగా ఇంధనం ఇవ్వాలని చూస్తోంది.ఇప్పటికే ఈ వినూత్న ప్రయోగం కోసం సీఏఎఫ్‌యూ ట్రయల్స్ కూడా నిర్వహించింది. దీనిలో భాగంగా ఇటీవల సీఏఎఫ్‌యూ ఎనిమిది ఇంధన ట్రక్కులతో రెండు రోజులలో అజ్మన్‌లోని 100 కుటుంబాలకు ఉచిత ఇంధనాన్ని అందించింది.
ఈ సందర్భంగా సీఏఎఫ్‌యూ వ్యవస్థాపకుడు, సీఈఓ రషీద్ అబ్దుల్లా అహ్మద్ అల్ ఘురైర్ మాట్లాడుతూ.. అవసరమైన వారికి సహాయపడటానికి తమ సంస్థ ఎప్పుడూ ముందు ఉంటుందని, దీనికి ఇహ్సాన్ స్వచ్ఛంద సంస్థ సహకరించడం గర్వంగా ఉందని అన్నారు. అల్పాదాయ ఫ్యామిలీలకు సీఏఎఫ్‌యూ చేస్తున్న ఈ సర్వీస్ అమోఘమని ఇహ్సాన్ ఛారిటీ సీఈఓ షేక్ డా.అబ్దుల్ అజీజ్ బిన్ అలీ బిన్ రషీద్ అల్ నుఎమి చెప్పారు.దీనిలో ఇహ్సాన్ సంస్థను భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇక ఇప్పటికే దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA) సహకారంతో ఫ్రంట్‌లైన్ కార్మికులకు కూడా సీఏఎఫ్‌యూ ఉచిత ఇంధనాన్ని అందిస్తోంది.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







