ఫేక్ మెడికల్ రిపోర్ట్: విచారణ ఎదుర్కొంటున్న ఆసియా వ్యక్తి
- August 25, 2021
మనామా: వర్క్ పర్మిట్‌ను మరో ఎంప్లాయర్‌కు ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు మెడికల్ రిపోర్టు అవసరం కాగా, దాన్ని ఫేక్ చేసిన 37 ఏళ్ల ఆసియా వ్యక్తిపై అభియోగాలు మోపబడ్డాయి. కోర్టు ఫైల్స్ ప్రకారం, నిందితుడు తన ట్రాన్స్ఫర్ ప్రక్రియను దాదాపు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో మెడికల్ సర్టిఫికెట్ విషయమై చిన్నపాటి అయోమయం నెలకొంది. హెపటైటిస్ ఉన్నట్లుగా రిపోర్టు వచ్చింది. ఇంకోసారి పరీక్ష చేయాలని డాక్టర్ సూచించగా, తనకు బదులుగా తనలాగానే ఉన్న తన స్నేహితున్ని టెస్టు కోసం పంపించాడు. అక్కడ టెస్ట్ ఫలితం నిందితుడు కోరుకున్నట్లుగా వచ్చింది. అయితే, రిపోర్టు తీసుకోవడానికి నిందితుడు వెళ్లగా, డాక్టర్లకు అతనిపై అనుమానం వచ్చి పరీక్ష చేయాలనుకున్నారు. అయితే, నిందితుడు తన స్నేహితున్ని ఆసుపత్రికి తీసుకొచ్చేందుకు బయటికి వెళ్లిపోయాడు. తిరిగి వచ్చేటప్పటికి పోలీసులు అక్కడ నిందితుడి స్నేహితుడ్ని అరెస్టు చేశారు. నిందితుడితో పాటు, అతని స్నేహితుడిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







