అక్టోబర్ 21న ప్రారంభంకానున్న ఐన్ దుబాయ్

- August 25, 2021 , by Maagulf
అక్టోబర్ 21న ప్రారంభంకానున్న ఐన్ దుబాయ్

దుబాయ్: అయిన్ దుబాయ్, ప్రపంచంలోనే అతి పెద్దదైన అబ్జర్వేషన్ వీల్ అక్టోబర్ 21న ప్రారంభం కానుంది.ఆగస్ట్ 25 నుంచి టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమవుతాయి.130 దిర్హాముల నుంచి టిక్కటె్ల ధరలు ప్రారంభమవుతాయి.ఈ వీల్, 250 మీటర్ల ఎత్తు కలిగి వుంటుంది. బ్లూ వాటర్స్ ఐలాండ్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు.విజిట్ దుబాయ్ లెక్కల ప్రకారం వీల్ లెగ్ ఒక్కోటి 126 మీటర్ల ఎత్తు వుంటుంది. గ్లాస్‌తో రూపొందిన క్యాప్సూల్ 820 అడుగుల ఎత్తువరకు వెళుతుంది. 360 డిగ్రీస్ వ్యూ దుబాయ్ స్కైలైన్ ఈ వీల్ ప్రత్యేకత.అయిన్ దుబాయ్ http://www.aindubai.com వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు జరుగుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com