'సందీప్ కిషన్' ఓ ఇంటివాడైనాడు
- March 14, 2016
'ప్రస్థానం' చిత్రంతో 2009లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కథానాయకుడు 'సందీప్ కిషన్'. ఆయనకు చిన్నతనం నుంచీ మూడు కోర్కెలు ఉండేవట. అవి ఏవో కాదు... సాధారణంగా అందరూ కావాలనుకునేవే! సొంత ఇల్లు, స్పోర్ట్స్ కారు, హోం థియేటర్. ఇందులో ఒకటైన ఇంటిని ఇటీవల ఆయన కొన్నారు. మాదాపూర్‌లోని నాలుగు పడక గదుల ఇల్లును కొన్నట్లు సందీప్ తెలిపారు. తన అపార్ట్‌మెంట్ నుంచి దుర్గంచెరువు కనబడుతుందని, అన్ని సౌకర్యాలు బావున్నాయని చెప్పారు. ఈ అపార్ట్‌మెంట్ ఎవరిదో కాదు. ఆయన మామయ్యదేనట. సందీప్ తన చిన్నతనంలోనే ఈ ఇంటిని కొంటానని తన మామయ్యతో అనేవాడట.తరువాత ఆయన మామయ్య దర్శకుడు వి.వి. వినాయక్‌కు అపార్ట్‌మెంట్‌ను అమ్మేశారు. దాదాపు ఏడేళ్లుగా దాచుకున్న డబ్బుతో సందీప్ కొద్ది నెలల క్రితం వినాయక్ దగ్గర నుంచి అపార్ట్‌మెంట్‌ను కొన్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







