మోడెర్నా వ్యాక్సిన్ భద్రతను ధృవీకరించిన ఎస్ఎఫ్డిఎ
- August 28, 2021
రియాద్: సౌదీ ఫుడ్ మరియు డ్రగ్స్ అథారిటీ (ఎస్ఎఫ్డిఎ), మోడెర్నా వ్యాక్సిన్ డోసులకు సంబంధించిన భద్రతను ధృవీకరించడం జరిగింది. అథరిటీ అధికార ప్రతినిథి తాయ్సెర్ అల్ ముఫార్రెజ్ మాట్లడాడుతూ, జపాన్‌లో రద్దు చేయబడిన బ్యాచ్ డోసుల వ్యవహారానికి, సౌదీ కింగ్డమ్ వచ్చిన బ్యాచ్ నెంబరుకీ తేడా వున్నట్లు పేర్కొన్నారు. ఎంఆర్ఎన్ఎ-1273 బ్యాచ్ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని తెలిపారు. ఫుడ్ మరియు డ్రగ్ అథారిటీ పలు పరీక్షలు నిర్వహించింది. అథారిటీ పలు శాంపిల్లను అన్ని షిప్మెంట్ల నుంచీ సేకరించి పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని ఆయన వివరించారు. పూర్తి పరీక్షల తర్వాతే వినియోగానికి అనుమతినిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగామోడెర్నా వ్యాక్సిన్‌ని జపాన్ సస్పెండ్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







