అక్రమంగా మిలిటరీ యూనిఫాంలు విక్రయిస్తున్న వస్త్ర దుకాణం మూసివేత
- August 28, 2021
సౌదీ అరేబియా: సెక్యూరిటీ అథారిటీస్, ఓ వస్త్ర దుకాణాన్ని రియాద్‌లో మూసివేయడం జరిగింది. సదరు దుకాణం నుంచి 300కి పైగా బ్యాడ్జీలు, గుర్తులను సీజ్ చేశారు. 100 మిలిటరీ యూనిఫాంలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. సౌదీ మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ గార్డ్, కామర్స్ మినిస్ట్రీ, స్టేట్ సెక్యూరిటీ ప్రెసిడెన్సీ, రియాద్ మునిసిపాలిటీ, రియాద్ లేబర్ బ్యూరో సంయుక్తంగా ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేసి, విచారణ చేపడుతోంది. స్థానిక పోలీస్ అలాగే పాస్‌పోర్ట్ అథారిటీ ఈ విచారణకు సహకరిస్తున్నాయి. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని రియాద్ గవర్నర్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ చెప్పారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







