ట్రావెల్ లా ఉల్లంఘనలకు పాల్పడితే ఐదేళ్ల జైలు, SR100,000 ఫైన్
- September 02, 2021
సౌదీ: కింగ్డమ్ లోకి నకిలీ డాక్యుమెంట్లతో అక్రమంగా చొరబడే వారిపై సౌదీ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించనుంది. నిబంధనలను ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష, జరిమానాలను దాదాపుగా రెట్టింపు చేస్తూ ట్రావెల్ లాలో సవరణలు చేసింది. చట్ట సవరణ ప్రకారం పాస్‌పోర్ట్‌లు/లైసేజ్-పాసర్ టిక్కెట్‌లను ఫోర్జరీ చేస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, SR 1,00,000 జరిమానా విధించనున్నారు. గతంలో మూడేళ్ల జైలు శిక్ష, SR50,000 జరిమానా ఉండేది. పాస్‌పోర్ట్‌లు/లైసేజ్-పాసర్ టిక్కెట్‌లలో అదనంగా సమాచారాన్ని జోడించడం, ఉన్న సమాచారాన్ని తొలగించడం, మార్చటం చేయటాన్ని ఫోర్జరీగా పరిగణిస్తారు. అలాగే ఉద్దేశపూర్వకంగా పాస్‌పోర్ట్‌లను నాశనం చేయడం లేదా డేటాను మార్చటం, వ్యక్తిగత ఫోటోలను మార్చడం వంటివి కూడా ట్రావెల్ లా నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తాయి. అంతేకాదు..పాస్‌పోర్ట్/లైసేజ్-పాస్‌సర్ టిక్కెట్‌ని నిర్లక్ష్యంగా పోగొట్టుకోవటం, పాస్‌పోర్ట్‌లను చట్టవిరుద్ధంగా ఉపయోగించడం, పాస్‌పోర్ట్ లేదా లైసెజ్-పాస్‌సర్ టిక్కెట్ విక్రయించటం కూడా ట్రావెల్ లా ఉల్లంఘనగా పరిగణిస్తారు. మూడవ పక్షానికి చెందిన పాస్‌పోర్ట్/లైసేజ్-పాసర్ టికెట్‌ని ఉపయోగించడానికి ప్రయత్నించే వారిపై, అలాగే సరైనా ట్రావెల్ డాక్యుమెంట్లు లేకుండా నిర్దేశిత పోర్ట్‌ల ద్వారా కింగ్‌డమ్ కి వచ్చినా, వెళ్లే ప్రయత్నం చేసినా కూడా శిక్షార్హులు అవుతారు.
తాజా వార్తలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు







