తారాసుద్+తో అందుబాటులోకి మరిన్ని సేవలు

- September 05, 2021 , by Maagulf
తారాసుద్+తో అందుబాటులోకి మరిన్ని సేవలు

ఒమన్: పలు ప్రభుత్వ సేవలు, కోవిడ్, కోవిడ్ వ్యాక్సిన్ ఇన్ఫర్మేషన్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన తారాసుద్ + యాప్ ను అప్ డేట్ చేసినట్లు ఒమన్ వెల్లడించింది. కొత్త అప్ డేట్ తో కోవిడ్ వ్యాక్సిన్, వ్యాక్సిన్ సర్టిఫికెట్, పాస్ పోర్ట్, ఫ్రొఫైల్ ఎడిటింగ్ ఇలా అన్ని సేవలను పొందవచ్చని వివరించింది. తారాసుద్+ అప్ డేట్ యాప్ ద్వారా వ్యాక్సిన్ డేటాను తెలుసుకోవచ్చు. అలాగే వ్యాక్సిన్ సర్టిఫికెట్లను చెక్ చేసుకోవచ్చు. హోం పేజ్ లోని క్యూఆర్ కోడ్ తో సర్టిఫికెట్ అందుబాటులోకి వస్తుంది. అలాగే పాస్ పోర్ట్ నెంబర్ మాడిఫై చేసుకునేందుకు వీలుంటుంది. ఫోన్ నెంబర్ ను డీలింక్ చేసి కొత్త నెంబర్ ను అప్ డేట్ చేయవచ్చు. అలాగే పిల్లలు, ఇంటి సహాకుల ప్రొఫైల్ ను విభజించొచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com