వాహనాల్లో పిల్లల్ని ఒంటరిగా వదిలేయోద్దు..దుబాయ్ పోలీసుల వార్నింగ్

- September 05, 2021 , by Maagulf
వాహనాల్లో పిల్లల్ని ఒంటరిగా వదిలేయోద్దు..దుబాయ్ పోలీసుల వార్నింగ్

దుబాయ్: పార్క్ చేసిన వాహనాల్లో పిల్లల్ని ఒంటరిగా వదిలేయోద్దంటూ దుబాయ్ పోలీసులు తల్లిదండ్రులు హెచ్చరించారు. ముఖ్యంగా వేడివాతావరణంలో పార్క్ చేసిన వాహనాల్లో ఉష్ణోగ్రత 70 సెల్సియస్ డిగ్రీలకు చేరే అవకాశాలు ఉంటాయని, దీంతో పిల్లల ప్రాణాలకు ముప్పు ఉంటుందని పేర్కొంది. సమ్మర్ సీజన్ కు ముందు పిల్లల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలంటూ దుబాయ్ పోలీసులు చేపట్టిన క్యాంపేన్లో భాగంగా ఈ జాగ్రత్త చర్యలను సూచించారు. వాహనాల్లో పిల్లలను ఒంటరిగా వదిలేయోద్దనే నినాదంతో పోలీసులు ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను నిర్లక్ష్యంగా కార్లలోనే వదిలేసి వెళ్తుంటారని, ఈ అలక్ష్యం ఒక్కోసారి పరిణామాలకు దారితీస్తాయని పోలీసులు చెబుతున్నారు. గత ఏడు నెలల్లో తాము వాహనాల్లో వదిలేసిన 39 పిల్లల్ని రక్షించామని గుర్తు చేశారు. పిల్లల్ని తమ వెంట తీసుకువెళ్లకుండా కార్లోనే కూర్చొబెట్టి లాక్ వేసి వెళ్తుంటారని...కానీ, వాహనాల్లోని తీవ్రమైన వేడి, ప్రాణవాయువు కొరతతో పిల్లలు ఊపిరాడక స్పృహ కోల్పోవడం, ప్రాణాలు కొల్పోవటం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెను విషాదాన్ని నింపుతాయన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com