భారత్ కరోనా అప్డేట్
- September 05, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో మరోసారి పెరిగాయి కరోనా పాజిటివ్ రోజువారి కేసులు. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 42,766 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.మరో 308 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 38,091 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,29,88,673 కు పెరగగా.. రికవరీ కేసులు 3,21,38,092కు పెరిగాయి. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,10,048 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇక మరోవైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 68,46,69,521 మందికి టీకా వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







