LMRAలో లీగలైజేషన్, కాన్సులర్ సర్వీసెస్ పున:ప్రారంభం
- September 06, 2021
బహ్రెయిన్: దేశ పౌరులు, ప్రవాసీయులకు విదేశీ వ్యహారాల సేవలు, చట్టబద్ధత సేవలను అందించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వరంలోని లీగలైజేషన్, కాన్సులర్ సర్వీసుల కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని కాన్సులర్ & అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాల కార్యదర్శి, రాయబారి తౌఫీఖ్ అహ్మద్ అల్-మన్సూర్ మాట్లాడుతూ.. కాన్సులర్ సేవలకు సంబంధించి పౌరులు, ప్రవాసీయులకు అన్ని సేవలను అందించేందుకు మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉంటుందన్నరు. ఇందులో భాగంగానే లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ప్రధాన కార్యాలయంలో లీగలైజేషన్, కాన్సులర్ సర్వీసెస్ కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇక నుంచి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో చట్టబద్ధత కోసం ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. పౌరులు, ప్రవాసీయులు కాన్సులర్, చట్టబద్ధత సేవలను పొందడం కోసం LMRA హెడ్ క్వార్టర్స్ లోని లీగలైజేషన్, కాన్సులర్ కార్యాలయాన్ని సంప్రదించొచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







