భారత్ కరోనా అప్డేట్
- September 06, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. డెల్టాతో పాటుగా డెల్టాప్లస్, ఏవై 11, ఏవై 12, ఏవై 13 వేరియంట్లు ఇండియాలో విస్తరిస్తున్నాయి. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,30,27,621కి చేరింది. ఇందులో 3,21,81,995 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా… 4,04,874 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 43,903 మంది డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.ఇకపోతే, 24 గంటల్లో 219 మంది మృతి చెందారు.దీంతో భారత్‌లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,40,752కి చేరింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







