విదేశాల నుంచి కువైట్ వచ్చిన ప్రయాణికుడికి కోవిడ్ పాజిటివ్
- September 06, 2021
కువైట్: డెల్టా వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశం నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడికి పీసీఆర్ టెస్టులో కోవిడ్ పాజిటీవ్ గా గుర్తించారు. కోవిడ్ నివారణ కమిటీ అధిపతి డాక్టర్ ఖలీద్ అల్-జరాల్లా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం అన్ని దేశాల నుంచి కువైట్ కు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయని, కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి కూడా విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో కువైట్ వచ్చే ప్రతి ప్రయాణికుడికి పీసీఆర్ టెస్ట్ నిర్వహణ చాలా కీలకం అని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అలక్ష్యం చేస్తే కువైట్లోనూ కొత్త వేరియంట్లకు చోటు ఇచ్చినట్లు అవుతుందన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుడికి పీసీఆర్ టెస్టులో కోవిడ్ పాజిటీవ్ రావాటాన్ని నిదర్శనంగా పేర్కొన్నారు. అయితే..పాజిటీవ్ గా నిర్ధారణ అయిన వ్యక్తి ప్రవాసీయుడు కాదని, ఈజిప్ట్ నుంచి వచ్చిన కువైట్ పౌరుడని ఆయన తన ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!