కార్ నడిపిన 12 ఏళ్ల బాలుడు..కార్ సీజ్
- September 08, 2021
కువైట్: కువైట్ లో పన్నెండేళ్ల బాలుడు డ్రైవ్ చేసిన SUV లగ్జరీ కారును పోలీసులు సీజ్ చేశారు. అతని కుటుంబంపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు కేసును రిఫర్ చేశారు. ఓ పన్నేండేళ్ల పిల్లాడు తన మూడేళ్ల సోదరుడిని వెంటబెట్టుకొని SUV లగ్జరీ కారును డ్రైవ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన కువైట్లోని సబా అల్ అహ్మద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే..వైరల్ అయిన వీడియో చివరికి పోలీసుల దృష్టికి వెళ్లింది. చట్టపరంగా పన్నెండేళ్ల బాలుడు డ్రైవ్ చేయటం నిబంధనలను ఉల్లంఘించటమే. దీంతో బాలుడు నడిపిన SUV కారును సీజ్ చేసిన పోలీసులు..అతని కుటుంబంపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







