వ్యాక్సిన్ల మిక్సింగ్ ప్రభావవంతం, భద్రతతో కూడినది: సౌదీ హెల్త్ మినిస్ట్రీ
- September 08, 2021
రియాద్: దేశంలో అనుమతి పొందిన వ్యాక్సిన్లకు సంబంధించి ఏ రెండు వ్యాక్సిన్లను మిక్సింగ్ చేసినా అది ప్రభావవంతమైనదేననీ, భద్రతతో కూడుకున్నదేననీ సౌదీ హెల్త్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఇలా వ్యాక్సిన్లను మిక్స్ చేయడం (ఒక డోసు ఓ కంపెనీ వ్యాక్సిన్, మరో డోసు ఇంకో కంపెనీ వ్యాక్సిన్) వల్ల అదనపు ఇమ్యూనిటీ లభిస్తుందని మినిస్ట్రీ వివరించింది. దేశంలో ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రా జెనకా, ఫైజర్ బయో ఎన్ టెక్, జాన్షన్ అండ్ జాన్సన్, మోడెర్నా, సినోవాక్ మరియు సినోఫామ్ వ్యాక్సిన్లకు అనుమతి వుంది. యూకే, జర్మనీ మరియు కెనడా తదితర దేశాలు వ్యాక్సిన్ల మిక్సింగ్‌కి ఇప్పటికే అనుమతులు మంజూరు చేశాయి. ఇదిలా వుంటే, సౌదీ అరేబియా ఇప్పటిదాకా 38 మిలియన్లకు పైగా వ్యాక్సిన్లను అందించడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







