తెలంగాణ: డ్రోన్లతో మెడిసిన్ పంపిణీ..

- September 11, 2021 , by Maagulf
తెలంగాణ:  డ్రోన్లతో మెడిసిన్ పంపిణీ..

హైదరాబాద్: డ్రోన్‌ టెక్నాలజీ ప్రపంచానికి కొత్త కాంతిని తీసుకొస్తుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. వికారాబాద్‌లో డ్రోన్‌ సాయంతో మారుమూల ప్రాంతాలకు మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన 'మెడిసిన్ ఫ్రం స్కై' ప్రాజెక్టును మంత్రి కేటీఆర్‌తో కలిసి కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. గ్రహంబెల్‌ టెలిఫోన్‌, రైట్‌ బ్రదర్స్‌ విమానం లాగే డ్రోన్‌ టెక్నాలజీ ఓ సంచలనమని చెప్పారు. డ్రోన్లతో ఔషధాలు సరఫరా చేస్తున్న యువతను అభినందించారు.

సాంకేతికతను అందించడమే ప్రధాని మోదీ స్వప్నమని తెలిపారు. డ్రోన్‌ పాలసీపై కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచన ఉందన్నారు. సాంకేతికత వల్ల దేశ యువశక్తి ప్రపంచానికి తెలుస్తుందని చెప్పారు. స్టార్టప్‌లను తేలిగ్గా చూడద్దని సూచించారు. చిన్న పరికరం అత్యవసర స్థితిలో మందులను మోసుకెళ్తోందని వెల్లడించారు. డ్రోన్‌తో మారుమూలకు మందులు వస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా అని ప్రశ్నించారు. ఏరోస్పేస్‌ టెక్నాలజీలో ఎన్నో మార్పులు వస్తున్నాయని సింధియా చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com