క్వారంటైన్ నిబంధనల్లో సవరణలు
- September 17, 2021
కువైట్: కోవిడ్ వైరస్ వ్యాప్తి తీవ్రతలో తగ్గుదల నమోదవుతుండటంతో క్వారంటైన్ నిబంధనలను సవరిస్తూ కువైట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇన్సిట్యూషనల్ క్వారంటైన్ ను వారం రోజుల కంటే తక్కువ రోజులకు కుదించేందుకు మొగ్గు చూపుతుంది. ఇన్సిట్యూషనల్ క్వారంటైన్ తర్వాత మిగిలిన రోజులు హోం క్వారంటైన్లో ఉండాల్సిందేనని కూడా స్పష్టం చేసింది. ఇదిలాఉంటే..దేశంలో వ్యాక్సిన్ రేటు ఈ నెలాఖరు నాటికి 100 శాతానికి చేరుతుందని...ఇంకా ఎవరైనా వ్యాక్సిన్ వేసుకోకుంటే వ్యాక్సిన్ వెబ్ సైట్ల ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఇదిలాఉంటే..క్వారంటైన్ గడువును తగ్గించనున్నట్లు తెలిపిన మంత్రిత్వ శాఖ..కోవిడ్ జాగ్రత్తలను మాత్రం కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. దేశంలోకి వచ్చే వాళ్లంతా పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ సమర్పించాల్సిందేనని వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







