ఐపీఎల్ టికెట్ ధర Dh 200..పరిమిత సంఖ్యలోనే అనుమతి
- September 17, 2021
యూఏఈ: ప్రపంచంలోనే అతి ఖరీదైన టీ-ట్వంటీ లీడ్ ఐపీఎల్ కు సమయం ఆసన్నమవుతోంది. సెకండ్ ఫేజ్ కోసం దుబాయ్, అబుధాబి, షార్జా వేదికలు సిద్ధమవుతున్నాయి. తొలి మ్యాచ్ ముంబై, చెన్నై మధ్య ఈ నెల 19న దుబాయ్ లో జరగబోతోంది. అయితే..కోవిడ్ తో కొన్ని నెలలుగా స్టేడియంలో కూర్చొని మ్యాచ్ ను ఆస్వాదించలేకపోతున్న క్రికెట్ ఫ్యాన్స్ కు ఈ సారి మాత్రం పండగే పండగ. పరమిత సంఖ్యలో అభిమానులను అనుమతించటంతో ఇక టికెట్ల బుకింగ్ సందడి షురు అయ్యింది. ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్ www.iplt20.com లో మ్యాచ్ టిక్కెట్ల అమ్మకం ఇప్పటికే ప్రారంభం అయ్యింది. PlatinumList.net లో కూడా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. అయితే..అబుధాబితో పోలిస్తే దుబాయ్, షార్జాలో టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. బిగ్ టీమ్స్ ఆడే మ్యాచ్ లకు టికెట్ల రేట్లను 200 దిర్హామ్ లుగా నిర్ధారించారు. దుబాయ్, షార్జాలో జరిగే మ్యాచ్ లన్నింటికి కనీస టికెట్ ధర Dh 200గా ఉంది. అయితే..అబుధాబిలో మాత్రం మూడింతలు తక్కువ ధరతో టికెట్ కొనుగోలు చేయవచ్చు. అబుధాబిలో జరిగే మ్యాచ్ లకు కనీస టికెట్ ధరను Dh 60గా నిర్ధారించారు.
అయితే...కోవిడ్ నేపథ్యంలో స్టేడియానికి వచ్చే ఫ్యాన్స్ కు కొన్ని కీలక సూచనలు చేశారు అధికారులు. 16 ఏళ్లలోపు వయసు వారిని స్టేడియంలోకి అనుమతించటం లేదని స్పష్టం చేశారు. 16 ఏళ్లకు పైబడిన వారు ఖచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని, విదేశాల నుంచి వచ్చిన వాళ్లైతే స్థానిక ప్రభుత్వం అనుమతించిన వ్యాక్సిన్ పొంది ఉండటంతో పాటు..పీసీఆర్ రిపోర్ట్ ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇక కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం టికెట్లను మొబైల్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలన్నారు. పరిమిత సంఖ్యలోనే అభిమానులను అనుమతిస్తున్నందున ముందుగానే టికెట్లను బుక్ చేసుకుంటే ఉత్తమం. సెక్యూరిటీ చెక్ లు ఉంటాయి కనుక మ్యాచ్ ప్రారంభానికి ముందుగానే స్టేడియానికి చేకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







