రోడ్డు ప్రమాదం: వాహనదారులకు అబుధాబి పోలీసుల హెచ్చరిక
- September 25, 2021
అబుధాబి: మోటర్ వే హార్డ్ షోల్డర్ ప్రమాద ఘటనకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసిన అబుదాబీ పోలీసులు, ఇలాంటి ప్రమాదాల పట్ల వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించడం జరిగింది. ఓ వాహనం ప్రమాదకరమైన రీతిలో హార్డ్ షోల్డర్లోకి దూసుకొచ్చింది. అత్యవసర వాహనాల కోసం మాత్రమే హార్డ్ షోల్డర్ మార్గాన్ని వినియోగించాల్సి వుంటుంది. కాగా, ప్రమాదం కారణంగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎప్పటికప్పుడు వాహనదారుల్ని ట్రాఫిక్ నిబంధనల విషయమై అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించేవారికి 1,000 దిర్హాముల జైలు, ఆరు పాయింట్లను లైసెన్సుకి జత చేయడం జరుగుతుంది. కాగా, అబుధాబిలో కొత్తగా 700 హైటెక్ స్పీడ్ కెమెరాలను రహదార్లపై ఏర్పాటు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. వాతావరణ సంబంధిత సమాచారాన్ని కూడా ఈ స్పీడ్ కెమెరాల ద్వారా తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







