షాహీన్ తుపాన్: అత్యవసరమైతే సంప్రదించాలని ఇండియన్ ఎంబసి కార్యాలయం సూచన

- October 03, 2021 , by Maagulf
షాహీన్ తుపాన్: అత్యవసరమైతే సంప్రదించాలని ఇండియన్ ఎంబసి కార్యాలయం సూచన

ఒమన్: షాహీన్ తుపాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉందని మస్కట్ లో ని భారత రాయబార కార్యాలయం అధికారులు తెలిపారు. ఇండియన్స్ అంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే రాయబార కార్యాలయాన్ని వెంటనే సంప్రదించాలన్నారు. ఎలాంటి సాయం, సమాచారం కావాలన్న ఇండియన్స్ ఈ నెంబర్ కు 93577979 వాట్సాప్ చేయాలని అధికారులు సూచించారు. కాన్సులేట్ డిపార్ట్ మెంట్ (98282270, [email protected]) లేదా కమ్యూనిటీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ (80071234, [email protected]) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు. షాహీన్ తుపాను తీవ్రత ఎక్కువ ఉన్న కారణంగా ఒమన్ ప్రభుత్వం ఇప్పటికే రెండు రోజులు సెలవు ప్రకటించింది.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com