వంతెన కింద ఇరుక్కుపోయిన ఎయిర్ ఇండియా విమానం
- October 04, 2021
న్యూ ఢిల్లీ: ఎయిర్ ఇండియాకు చెందిన రెక్కలు లేని విమానం ఒకటి వంతెన కింద ఇరుక్కుపోయింది. ఢిల్లీ గుర్గావ్ హైవేపై ఈ ఘటన జరిగింది. రోడ్డుకు ఒక పక్కగా వాహనాలు వెళ్తుండగా మరోవైపు వంతెన కింద ఇరుక్కున్న విమానం కనిపించింది. ప్రస్తుతం ఈ విమానం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియో ఎయిర్ ఇండియా అధికారుల దృష్టికి వెళ్లడంతో దీనిపై స్పందించారు.
తాము అమ్మేసిన పాత విమానం కొన్న వ్యక్తి తరలిస్తుండగా వంతెన కింద స్ట్రక్ అయినట్లు చెప్పారు. ఈ ఘటనతో ఎయిర్ ఇండియాకు ఎలాంటి సంబంధం లేదని వివరించింది. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్థానిక అధికారులు శ్రమించి విమానాన్ని వంతెన కింద నుంచి బయటకు తెచ్చారు.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







