తుపాను బాధిత కుటుంబాలకు 1,000 రియాల్స్ సాయం
- October 09, 2021
ఒమన్:ఒమన్ లో షాహీన్ తుపాను బాధితులకు ప్రభుత్వం కాస్త ఉపశమనం కల్పించింది. సైక్లోన్ ఎఫెక్ట్ తో పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి తక్షణం వెయ్యి రియాల్ సాయం ప్రకటించింది. రెస్క్యూ టీమ్ లు యుద్ధప్రాతిపదిక సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. షాహీన్ ఎఫెక్ట్ కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం మంత్రి వర్గ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తుపాను బాధిత కుటుంబాలకు మరింత సాయం చేస్తామని ప్రభుత్వం తెలిపింది. విరిగిన స్తంభాలను, చెట్లను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు.
ఇప్పటికీ ఎఫెక్ట్ ఒమన్ లోని కొన్ని పట్ణణాలు, సిటీల్లో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది. అపార్ట్ మెంట్ వాసులకు, ప్రజలకు హెలికాప్టర్ ద్వారా ఫుడ్, వాటర్ సప్లయ్ చేస్తున్నారు. ఖబౌరా సహా కొన్ని ప్రాంతాల్లో వాతావారణ పరిస్థితులు ఇప్పటికీ కంట్రోల్ లోకి రాలేదు. నేషనల్ కమిటీ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ (NCEM) ప్రజలకు భరోసా ఇస్తూ సహాయక కార్యక్రమాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







