110 సీటర్ల ఈ190 మోడల్‌ విమానాన్ని గన్నవరం నుంచి....

- March 17, 2016 , by Maagulf
110 సీటర్ల ఈ190 మోడల్‌ విమానాన్ని గన్నవరం నుంచి....

విజయవాడ కేంద్రంగా ఏర్పాటైన విమానయాన సంస్థ ఎయిర్‌కోస్టా మరో కొత్త విమానాన్ని తన సర్వీసులకు జోడించింది. 110 సీటర్ల ఈ190 మోడల్‌ విమానాన్ని గన్నవరం నుంచి నడుపుతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి వివిధ ప్రాంతాలకు నడుపుతున్న సర్వీసుల్లో ఈ కొత్త విమానాన్ని కూడా జోడించనున్నట్టు ఎయిర్‌కోస్టా స్పష్టం చేసింది. విజయవాడ- బెంగళూరు- కోయంబత్తూరు - హైదరాబాద్‌ మధ్య నడిచే సర్వీసుకు ఈ విమనాన్ని నడపనున్నట్లు ఎయిర్‌ కోస్టా అధికారులు తెలిపారు. కొత్త విమానం రాకతో గన్నవరం విమానాశ్రయం నుంచి నడిచే విమానాల సంఖ్య 15కు చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com