భారత్ కరోనా అప్డేట్
- October 11, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేశాయి.ఈ క్రమంలో ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. 20వేల మార్క్ దాటి నమోదవుతున్న కరోనా కేసులు.. మళ్లీ 20వేలకు దిగువన నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,132 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 193 మంది మరణించారు. ఉపశమనం కలిగించే విషయం ఎంటంటే.. దాదాపు ఆరు నెలల తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. దేశంలో ప్రస్తుతం 2,27,347 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 209 రోజుల తర్వాత యాక్టివ్ కేసులు ఈ స్థాయిలో తగ్గినట్లు కేంద్రం తెలిపింది.
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,39,71,607 కి పెరిగింది. మరణాల సంఖ్య 4,50,782 కి చేరింది. అయితే.. నిన్న కరోనా నుంచి 21,563 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,32,93,478 కి చేరిందని కేంద్రం వెల్లడించింది. కాగా దేశంలో రికవరీ రేటు భారీగా పెరిగినట్లు కేంద్రం తెలిపింది. మార్చి తర్వాత రికవరీ రేటు 98శాతానికి పెరగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!







