'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపు

- October 10, 2021 , by Maagulf
\'మా\' అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఈ రోజు పోలింగ్‌ ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.. ముందుకు నిర్ణయించిన ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటలకే ఓటింగ్‌ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉండడం మరో గంటపాటు పోలింగ్‌ సమయాన్ని పొడిగించారు. దాంతో ఈ ఎన్నికలో రికార్డు స్థాయిలో 665 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ ఎన్నికలో రెండు ప్యానళ్ల సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఇక పోలింగ్ జరుగుతున్న సమయంలో వీరి మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. అయితే ఇంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికలో మంచు విష్ణు విజయం సాధించాడు. ఈ విషయాన్ని కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై ఎన్ని ఓట్ల తేడాతో విజయం సాధించారో కూడా చెప్పనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com