ఢిల్లీ-తిరుపతి మధ్య నాన్‌స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభించిన స్పైస్‌జెట్
- October 18, 2021
న్యూ ఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఢిల్లీ-తిరుపతి మధ్య నాన్‌స్టాప్ విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. సహాయ మంత్రులు జనరల్ వీకే సింగ్, ప్రహ్లాద్ పటేల్, స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ జెండా ఊపి నిన్న విమాన సేవలను ప్రారంభించారు.
అనంతరం సింధియా మాట్లాడుతూ.. ఢిల్లీ-తిరుపతి మధ్య ప్రస్తుతం బుధవారం, శుక్రవారం, ఆదివారం సర్వీసులు నడుస్తాయని, ఈ నెల 31 తర్వాత వారంలో నాలుగు రోజులు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మే 2022 నాటికి తిరుపతి రన్‌వే విస్తరణ పనులు పూర్తిచేసి వైట్‌బాడీ అంతర్జాతీయ విమానాలు ల్యాండ్ అయ్యేలా చూస్తామన్నారు.
తిరుపతి విమానాశ్రయం ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ముంబై, హైదరాబాద్, బెంగళూరు, బెళగావి, కలబురిగి, కొల్హాపూర్ నుంచి తిరుపతికి నేరుగా విమానాలు నడుస్తున్నాయి. ఢిల్లీ నుంచి ఇదే తొలిసారి. ఈ రెండు నగరాల మధ్య 2,160 కిలోమీటర్లు కాగా, విమానంలో రెండున్నర గంటల్లో చేరుకోవచ్చు. రైల్వే రెండో తరగతి ఏసీ చార్జీల కంటే తక్కువ ధరకే విమాన సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







