ఇజ్రాయిల్ నీటి సమస్యపై వినూత్న నిరసన...నగ్న ఫోటో షూట్
- October 18, 2021
ఇజ్రాయిల్: ఇజ్రాయిల్‌లో సుమారు 200 మంది మోడళ్లు .. నగ్నంగా ఫోటో షూట్‌లో పాల్గొన్నారు. డెడ్ సీ వద్ద ఉన్న ఎడారిలో వాళ్లంతా ఫోటో షూట్ చేశారు. అమెరికన్ ఆర్టిస్ట్ స్పెన్సర్ టునిక్ ఈ ఫోటోలను తీశారు. మోడళ్లు అందరూ శరీరానికి తెల్ల రంగు వేసుకుని ఫోటో షూట్‌లో పాల్గొన్నారు. ఇజ్రాయిల్‌లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. అయితే డెడ్ సీ వద్ద జల సంపద తరిగిపోతోంది. ఆ సమస్యపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో న్యూడ్ ఫోటో షూట్‌ను ఆర్గనైజ్ చేశారు.
54 ఏళ్ల ఫోటోగ్రాఫర్ స్పెన్సర్ ఆదేశాలకు తగినట్లు మోడళ్లు ముందుకు కదిలారు. ఇజ్రాయిల్ పర్యాటక శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫోటోగ్రాఫర్ ట్యూనిక్ గతంలో ఓ సారి వెయ్యి మంది మోడళ్లతో ఉప్పునీటి సముద్రమైన డెడ్ సీ వద్ద న్యూడ్ ఫోటోలు తీవారు. ప్రతి ఏడాది డెడ్ సీ సుమారు ఓ మీటరు మేర ఎండిపోతున్నది.
ఇజ్రాయిల్, జోర్డాన్‌లు ఎగువ ప్రాంతంలో నీటి మళ్లించడంతో డెడ్ సీ ఎండిపోవాల్సి వస్తోంది. దీనికి తోడు మైనింగ్ కూడా సమస్యగా మారింది. మోడళ్లకు వైట్ పేయింట్ వేయడానికి ట్యునిక్ ఓ కారణం చెప్పాడు. బైబిల్‌లోని కథ ప్రకారం.. లాట్ అనే వ్యక్తి భార్య ఉప్పు స్తంభంగా మారిపోతుందని, ఆ ఘటనను దృష్టిలో పెట్టుకుని మోడళ్లకు తెలుపు రంగు వేసినట్లు టునిక్ తెలిపారు.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







