షిర్డీకి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీ..
- October 18, 2021
హైదరాబాద్: షిర్డీకి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజ్‌ను ప్రారంభించినట్టు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ (TSTDC) తెలిపింది.హైదరాబాద్ నుంచి షిర్టీ వెళ్లే భక్తులకు ఈ ప్యాకేజ్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ఈ ప్యాకేజ్ వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రతి బుధ, శుక్రవారాల్లో సాయంత్రం 4 గంటలకు బేగంపేటలోని టూరిజం ప్లాజా నుంచి ప్రత్యేక బస్సు బయలుదేరుతుంది. టూర్ ప్యాకేజ్‌లో భాగంగా వెళ్లేటప్పుడు శనిసింగనాపూర్, వచ్చేటప్పుడు అజంతా ఎల్లోరాను సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు.
మూడు రోజుల పాటు సాగే ఈ టూర్‌కు పెద్దలు రూ.3,250, పిల్లలు రూ.2,060 చెల్లించాలి. ఈ టూర్‌లో ప్యాకేజ్‌లో భాగంగా షిర్డీలో ఒక రాత్రి బస ఏర్పాటుచేస్తారు. అయితే షిర్డీ సాయిబాబా దర్శనానికి దర్శనం టికెట్లను ఎవరికివారే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని టీఎస్‌టీడీసీ ఎండీ మనోహర్‌రావు తెలిపారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో షిర్డీ సాయిబాబా ఆలయ అధికారులు.. కోవిడ్ సర్టిఫికేట్ ఇతర వివరాలు అడుగుతున్నందున్న తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ తరఫున టికెట్లు బుక్ చేయడం లేదని అన్నారు. ఇక ప్రస్తుతం పర్యటక స్థలాలన్ని కూడా తెరుచుకోవడంలో పర్యటకులతో సందడిగా నెలకొంది. కాకపోతే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినా.. కోవిడ్ నిబంధనలు పాటించడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా తగ్గిందని నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం పొంచివుండే అవకాశం ఉందంటున్నారు. టూర్‌లో భాగంగా మాస్క్‌లు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవడం మర్చిపోవద్దని చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







