నెదర్లాండ్స్‌ పై ఐర్లాండ్‌ ఘన విజయం

- October 19, 2021 , by Maagulf
నెదర్లాండ్స్‌ పై ఐర్లాండ్‌ ఘన విజయం

అబుధాబి: టీ20 ప్రపంచకప్‌-2021 క్వాలిఫయర్స్‌ పోటీల్లో భాగంగా గ్రూపు-ఏలోని ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌ జట్లు సోమవారం తలపడ్డాయి.అబుధాబిలోని షేక్‌ జాయేద్‌ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 02:00 గంటల కు మ్యాచ్‌ ఆరంభమైంది.ఈ క్రమంలో టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.నిర్ణీత 20 ఓవర్లలో 106 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

ఇక నెదర్లాండ్స్‌ విధించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 4 వికెట్లు పడగొట్టి నెదర్లాండ్స్‌ పతనాన్ని శాసించిన కర్టిస్‌ కాంపర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.గెలుపు పట్ల ఐర్లాండ్‌ కెప్టెన్‌ బల్బిర్నీ స్పందిస్తూ.. టాస్‌ ఓడినా టార్గెట్‌ను ఛేజ్‌ చేయడం సంతోషంగా ఉందన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com