ఇండియా టూరిస్టు వీసాలకు మరోసారి దరఖాస్తు చేసుకోవాలి
- October 19, 2021
మస్కట్: ఒమనీయులు ఇండియా వచ్చేందుకు పర్యాటక వీసాల కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. కోవిడ్ నేపథ్యంలో అక్టోబర్ 15 కంటే ముందు తీసుకున్న వీసాలను సస్పెండ్ చేసినట్లు రాయబార కార్యాలయం ప్రకటించింది. తాజాగా ఇండియాలో కోవిడ్ నిబంధనలు సడలించడంతో తాజాగా వీసాలు జారీ చేస్తున్నామని, అక్టోబర్ 15 నుంచి వీసాల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. వీసాలు పొందిన వారు నవంబర్ 15 నుంచి ఇండియాలో పర్యాటకానికి అనుమతిస్తారు. టూరిస్టు వీసాపై ఒక్కరిని 30 రోజులకు మాత్రమే అనుమతిస్తారు. ఇండియాలో ప్రవేశించిన వారు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. టూరిస్ట్ వీసా బుక్ చేయాలనుకునే వారు ఒమన్‌లో Wattayah లోని BLS ఇంటర్నేషనల్ సర్వీసెస్ నుండి వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా http://www.indianvisaonline.gov.in/evisa ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







