పర్వతం పైనుంచి వాహనం పడి నలుగురు మృతి, ఐదుగురికి గాయాలు
- October 19, 2021
సౌదీ: రియాద్ నగరానికి పశ్చిమాన ఉన్నఎత్తైన పర్వతం పైనుంచి శనివారం వాహనం కిందపడిన ఘటనలో నలుగురు ప్రయాణికులు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ముహమ్మద్ అల్-హమ్మది ప్రకారం.. ఆ వాహనంలో తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారని, గాయపడ్డ వారిని సెక్యూరిటీ ఏవియేషన్ విమానంలో సమీప ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.
యూనిఫైడ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తరువాత సివిల్ డిఫెన్స్ రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని ఆయన తెలిపారు. ప్రమాద స్థలం నుంచి నలుగురి మృతదేహాలను వెలికి తీశామన్నారు. పర్వతాలపై పర్యటనకు పోయే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా అల్-హమ్మది ప్రజలకు సూచించారు. అత్యవసర సమయాల్లో మక్కా, రియాద్ ప్రాంతాలలో 911... కింగ్‌డమ్‌లోని ఇతర ప్రాంతాలలో 998 నంబర్ కు ఫోన్ చేసిన సహాయం పొందాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







