TPS Qatar వారి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలు
- October 19, 2021
దోహా: తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ -దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి.ముఖ్య అతిథులుగా భారత రాయబారి కార్యాలయ కార్యదర్శి పద్మ కర్రీ మరియు ఐసీబీఫ్ అధ్యక్షుడు జాయిద్ ఉస్మాన్ ఐసీసీ ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్ ఐసీసీ సలహదారుల కమిటీ చైర్మన్ కె.ఎస్ ప్రసాద్ గారు ఐసీబీఫ్ కమిటీ సభ్యురాలు రజినీ మూర్తి తెలంగాణ ప్రజా సమితి అడ్వైజరి కమిటీ చైర్మన్ చెనవేణి తిరుపతి మరియు ఖతర్ లోని ఇతర తెలుగు సంఘాల నాయకులూ పాల్గొని వేడుకలను తిలకించారు.
స్థానిక లయోలా స్కూల్ వేదికగా ఈ సంబరాలను తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు గద్దె శ్రీనివాస్ అధ్యక్షతన వేడుకలు ప్రారంభం అవగా వాక్యతలుగా చెన్న ప్రత్యుష మరియు వేణుగోపాల్ పడకంటి కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు.
తెలంగాణ ప్రజా సమితి సాంస్కృతిక విభాగం కార్యదర్శి ధర్మరాజు యాదవ్ పంచిత, ఈవెంట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ అల్లే వారిచే రూపొందించిన అనేక నృత్య ప్రదర్శనను స్థానిక మహిళలు పిల్లలు తమ తమ ప్రతిభను వేదికపై చక్కగా ప్రదర్శించి ఆహుతులందరిని అలరించారు తదనంతరం బతుకమ్మ వేడుక ప్రారంభం అవ్వగా..ఎడారి గడ్డ పై తెలంగాణ సంస్కృతి సంప్రధాయాలను ప్రతిబింబించేలా తెలంగాణ ప్రవాసి మహిళలు అందరూ మహా బతుకమ్మను పేర్చి ఆనందంగా ఆటలాడి శాస్త్రీయంగా గౌరమ్మను నిమజ్జనం చేశారు.
మహిళలు పేర్చిన అందమైన బతుకమ్మల్లో అందరిని ఆకట్టుకున్న బతుకమ్మను న్యాయనిర్ణేతల సమక్షంలో ఎంపిక చేసి బహుమతి ప్రధానం చేయడం జరిగింది.
అనంతరం జమ్మి చెట్టుకు పూజ చేసి ఒకరిని ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ జమ్మి ఆకును పంచుకుని దసరా పండగను జరుపుకున్నారు. తెలంగాణ రుచికరమైన వంటలను అతిథులందరికి వడ్డించడం జరిగినది. ఈ ఉత్సవానికి ఛానల్ 5 మరియు మా గల్ఫ్ మీడియా భాగస్వాములుగా వ్యవహరించారు.
చివరగా తెలంగాణ ప్రజా సమితి ఉపాధ్యక్షుడు సురేందర్ నామాల, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ పొట్ట ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ అతిధులకు, సబ్యులకు, స్పాన్సర్లకు, మీడియా మిత్రులకు మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







